తమిళ టాప్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశావ్యాప్తంగా పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ గా రజినీకాంత్ క్రేజ్ సంపాదించారు.తమిళనాడులో పోటీగా విజయ్, అజిత్ లాంటి మాస్ హీరోలు పోటీగా ఉన్నా ఇప్పటికీ కూడా వాళ్లకి గట్టి పోటీ ఇస్తున్నారు సూపర్ స్టార్. ఆయన కథానాయకుడిగా తమిళ సక్సెస్ ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్'.కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మొదటి పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఇంకా సోషల్ మీడియాని ఈ పాట తెగ షేక్ చేస్తుంది.తాజాగా ఇవాళ సెకండ్ సింగిల్‌ని సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఆగస్టు 10న జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ రమ్య కృష్ణన్, తమన్నా తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాని చాలా భారీగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది. ఈ సినిమాకి విజయ్ కార్తిక్ కన్నన్ కెమరామెన్ గా పనిచేస్తుండగా ఇంకా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. అలాగే డిఆర్ కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా ఈ సినిమాకి స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఇక చాలా కాలం నుంచి వరుస ప్లాపులతో వున్న రజినీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.రజినీకాంత్ కంప్లీట్ గా ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకొని చాలా సంవత్సరాలు అవుతుంది.రోబో సినిమా తరువాత మళ్ళీ రజినీకాంత్ తన రేంజ్ హిట్ ని అందుకోలేకపోయారు. మరి ఈ సినిమా రజినీకాంత్ కి తన రేంజ్ హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి.