తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా ... జ్యోతిక హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మొదటి మూవీ తోనే అపజయాన్ని ఎదుర్కొన్న హరీష్ ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన మిరపకాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో హరీష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది.
ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు గబ్బర్ సింగ్ ... రామయ్య వస్తావయ్య ... సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ... దువ్వాడ జగన్నాథం ... గద్దల కొండ గణేష్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఇందులో ఎక్కువ శాతం మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు కొంత కాలం క్రితమే పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ ... పవన్ తో రూపొందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ను కొన్ని రోజుల పాటు నిలిపి వేసి రవితేజ తో ఒక మూవీ ని చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.