ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ప్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఒకరు అయినటువంటి
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే
రజినీ కాంత్ ఆఖరుగా పెద్దన్న అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ లో రజనీ కాంత్ సరసన
లేడీ సూపర్ స్టార్ నయన
తార హీరోయిన్ గా నటించగా ...
మహానటి కీర్తి
సురేష్ ఈ
మూవీ లో రజనీ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ
మూవీ కి
శివ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.
ఇలా పెద్దన్న సినిమాతో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన రజిని ప్రస్తుతం నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ జైలర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో మిల్క్
బ్యూటీ తమన్నా ...రజిని సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...
రమ్య కృష్ణ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ ని ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదల కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ లోని "హుకుం" అంటూ సాగే రెండవ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.