"బ్రో" మూవీ సెకండ్ సింగిల్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా బ్రో అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం మై డియర్ మార్కండేయ అంటూ సాగే పాటను విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


ఈ పాటలో పవన్ మరియు సాయి తేజ్ లు కనిపించారు. వీరిద్దరూ కూడా ఈ సాంగ్.లో తమ డాన్స్ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం సాయి తేజ పై రూపొందించి నటు వంటి జానవులే అనే సాంగ్ ను తాజాగా విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదలకు ముందు నుండే ఈ సాంగ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని రెండవ సాంగ్ అయినటు వంటి జానవులే సాంగ్ విడుదల 24 గంటల్లో ప్రేక్షకుల నుండి 1.52 మిలియన్ వ్యూస్ ను ... 69 కే లైక్స్ ను సాధించి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.


ఇది ఇలా ఉంటే కెరీర్ లో మొదటి సారి ఈ  మూవీ లో పవన్ ... సాయి తేజ్ లు కలిసి ఒకే మూవీ లో ఫుల్ లెన్త్ లో నటించడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే జూలై 28 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: