ఒక నెల ముందే ప్రసారానికి రెడీగా ఉన్న బిగ్ బాస్....!!
అంతేకాకుండా ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల విషయంలో కూడా మేకర్స్ ఎన్నో రూల్స్ పెట్టారని అలాగే స్టార్ సెలబ్రిటీలనే ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈసారి అలాంటి విమర్శలకు తావు లేకుండా టాస్కుల విషయంలోను కంటెస్టెంట్ల విషయంలోనూ అలాగే రూల్స్ విషయంలోనూ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.అయితే ఈసారి సీజన్లో పాల్గొనబోయే కంటస్టెంట్లు ఎవరు అనే విషయం గురించి ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే యూట్యూబర్స్, సింగర్స్, న్యూ లీడర్స్ బుల్లితెర ఆర్టిస్టులు ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారానికి సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.