జనాల మధ్య షూటింగ్ లను ఇష్టపడే స్టార్ హీరో ఎవరో తెలుసా...??

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరైన బాలకృష్ణ అంటే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆయన కు మాస్ ఫాలోయింగ్ పిచ్చ పిచ్చ గా ఉంది అనటంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అలాగే ఆయన నిర్మాతల శ్రేయస్సును కోరుకునే అతికొద్ది మంది హీరోల లో ఒకరు.సినిమాకు ఎంత తీసుకున్నా నిర్మాతకు నష్టం రాకూడదనే ఆలోచన ఉన్న ఏకైక హీరో బాలయ్య అని చెప్పవచ్చు.ప్రస్తుతం హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల లో నటిస్తున్నారు.పాన్ ఇండియా సినిమా లకు 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చవుతోంది.అయితే స్టార్ హీరో బాలకృష్ణ ఇతర హీరోలకు భిన్నంగా జనాల మధ్య షూటింగ్ ను ఇష్టపడతారు.జనాల మధ్య షూట్ లో పాల్గొంటే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.దాని వల్ల నిర్మాతలకి కూడా బడ్జెట్ భారం తగ్గుతుంది అని ఆయన ఆలోచన.

ఐతే ఔట్ డోర్ షూటింగ్ లకు బాలయ్య ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాతలపై భారం తగ్గుతోందని తెలుస్తోంది.చాలామంది హీరోలు చిన్న సీన్లకు కూడా సెట్స్ వేయాలని కోరుతుండగా బాలయ్య మాత్రం ఇతర హీరోలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ విధం గా చేసే హీరో బాలయ్య మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్యకు కొన్ని విషయాలకు సంబంధించి ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ హీరో లలో ఒకరైన బాలయ్య క్రేజ్ ను అంతకంతకూ పెంచుకోవడం తో పాటు ఇతర హీరోలను సైతం ఎంతగానో గౌరవిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఏదేమైనా బాలకృష్ణ గారి కి ఉన్న క్రేజ్ నిన్నో మొన్నో వచ్చింది కాదు. ఆయన ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఆయన చేసిన హార్డ్ వర్క్ ఆయన్ని ఇండస్ట్రీ లో నిలబెట్టింది అనటం లో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: