నన్ను నేను నిరూపించుకుంటానంటున్నా 'బేబీ' హీరోయిన్....!!

murali krishna
తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు కూడా వేడుకకు హాజరై సక్సెస్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్కేఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు బాగా విజయాన్ని అందుకున్నాయి. జూలై 14 వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా మారిపోయింది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బేబీ ఒక రియాలిటీ స్టోరీ ..మన చుట్టూ ఉండే కథలలో నుంచి తీసుకున్న స్టోరీ ఇది. చిన్న చిన్న క్యారెక్టర్లు యూట్యూబ్లో దొరికిన షార్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా చేసుకుంటూ వచ్చాను.. అలాంటి సమయంలోనే నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని సమయంలో డైరెక్టర్ సాయి రాజేష్ గారు బేబీ సినిమా తీసుకొచ్చారు. దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత అదృష్టం తలుపు తట్టింది అనుకున్నాను.

అయితే ఇదే సమయంలో ఒక యూట్యూబర్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ చాలామంది హేళన చేశారు. ఇక ఆ మాటలకు ఈ సినిమాతో సమాధానం చెప్పాలి అనిపించింది డైరెక్టర్ సాయి రాజేష్ గారే నాకు ఇందుకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇక అమ్మ నాన్న నాకు జన్మనిస్తే మీరు నాకు రెండవ జన్మ ఇచ్చారు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కానీ నిర్మాత ఎస్ కే ఎన్ గారు, డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు అంటూ ఎమోషనల్ అయింది వైష్ణవి..

ఒకానొక సమయంలో ఒక సినిమాలో ఒక నిమిషం క్యారెక్టర్ చేసిన సరే మా వాళ్ళందరికీ టికెట్స్ తీసుకొని సినిమాకు తీసుకెళ్లి మరి నేను చేశాను అని చూపించుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఫుల్ సినిమాలో మొత్తం నేనే కనిపిస్తున్నాను. ఒక్క పాటైనా బాగుండాలి అనుకుంటే ఇక్కడ అన్ని పాటలు బాగున్నాయి.. ఖచ్చితంగా నన్ను నేను నిరూపించుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: