కమెడియన్ సత్య.. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?
ముఖ్యంగా నేటి తరం కమెడియన్స్ లో సత్యా తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. పిల్ల జమిందార్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య.. ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా మారిపోయాడు. నాగశౌర్య నటించిన రంగ బలి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి కడుపుబ్బా నవ్వించాడు ఈ కమెడియన్.
అయితే ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా కొనసాగుతున్న సత్య ఇక ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే సత్య ఇండస్ట్రీకి రాకముందు హైదరాబాద్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడిపే వాడట. ఇక ఒకవైపు అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టేవాడట. ఇక ఈయనకు కమెడియన్ ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమం లో అవకాశం కల్పించారు. అప్పటికే ధనరాజ్ సినిమా అవకాశాలను అందుకుంటూ జబర్దస్త్ లో గుర్తింపు పొందారు. దీంతో సత్యను జబర్దస్త్ కార్యక్రమం లోకి కూడా ఆహ్వానించాడు ధనరాజ్. అయితే జబర్దస్త్ లో కొంతకాలం సందడి చేసిన సత్యా ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని ఇక ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.