ముదురుతున్న రోబో శంకర్.. హన్సిక వివాదం..!!

Divya
టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించింది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపును ఏర్పరచుకుంది. టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఈ అమ్మడు ఎక్కువగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తను నటించిన తాజా చిత్రం పార్ట్నర్.


ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించగా ఇందులో రోబో శంకర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. అందుకోసం ఒక ప్రెస్ మీట్ని కూడా నిర్వహించారు ప్రెస్మీట్లో భాగంగా రోబో శంకర్ మాట్లాడుతూ హన్సిక పైన పలు విషయాలను తెలియజేశారు. రోబో శంకర్ మాట్లాడుతూ డైరెక్టర్ ఎంత చెప్పినా హన్సిక నా కాలు తాకను అన్నారు ఆమె తనని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు.. దీన్ హన్సిక తీరుతో అక్కడ ఉన్న దర్శకుడు తో పాటు సెట్లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయామంటూ రోబోశంకర్.


దీంతో రోబో శంకర్ చేసిన వివాదాస్పదమైన వాక్యాలు తెగ వైరల్ గా మారుతున్నాయి..మళ్లీ రోబో శంకర్ ఇటీవలే మాట్లాడుతూ తాను ఈ వాక్యాలను చాలా ఫన్నీగా చేశానని క్షమాపలు చెప్పాల్సిన పనిలేదని హన్సిక ను కూడా తాను చెడు ఉద్దేశంతో అలా చెప్పలేదని కూడా తెలియజేశారు. కానీ అయినప్పటికీ గాయని చిన్మయి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చాలా వైరల్ గా చేయడానికి కష్టపడుతోందని విషయాలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. రోబో శంకర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆయనకు జాండీస్ సోకిందని.. మానసిక పరిస్థితి బాగా లేకపోయిందని వివరణ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా హన్సిక పబ్లిక్ లో ఇలా మాట్లాడడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: