వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !
సాధారణంగా పబ్ సాంగ్స్ చాలా జోష్ తో హుషారుగా నడుస్తాయి. అందులో స్పెషల్ సాంగ్ లో ఒక ఐటమ్ గర్ల్ చిందులు వేస్తూ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ వాతావరణం అంతా కొనసాగిస్తూ పబ్ సాంగ్ లో వేదాంతాన్ని పలికించడం ఈనెలాఖరున విడుదలకాబోతున్న ‘బ్రో’ మూవీ ఐటమ్ స్పెషాలిటీగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న ‘బ్రో’ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అది వైరల్ గా మారింది. ఐటమ్ గర్ల్ గ్లామర్ భారీ సెటింగ్ కలలు మిరిమెట్లు కొలిపే లైటింగ్ హంగామా మధ్య చిత్రీకరించిన ఈమూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ లో రొటీన్ కు భిన్నంగా ఉన్న వేదాంతం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
ప్రతిరోజు ఒక పండగలా జీవించాలి అంటూ చెప్పే వేదాంతం మధ్య ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి మంచి పదాలను సమకూర్చాడు. లిరికల్ వీడియోగా విడుదలైన ఈపాట చాల హుషారుగా ఉంటుంది అన్న హింట్ వస్తున్నప్పటికీ ఈపాట ట్యూన్ అంతా కేచీగా లేదు అన్న హింట్స్ వస్తున్నాయి. పవన్ కల్యాణ్ దేవుడు గా కనిపించే ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాల హుషారుగా ఉంటూ అంతర్లీనంగా భావయుక్తమైన డైలాగ్స్ కూడ ఈమూవీకి ప్లస్ పాయింట్ అవుతాయని అంచనాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అతడి మార్క్ తో ఉండే పంచ్ డైలాగ్స్ సముద్రఖని దర్శకత్వం ఈమూవీని బ్లాక్ బష్టర్ హిట్ గా మారుస్తుందని పవన్ అభిమానుల అంచనా.
పవన్ కళ్యాణ్ ఒకవైపు వారాహి యాత్రలో బిజీగా ఉంటూనే మధ్యలో ఈమూవీకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడ పూర్తి చేశాడు. ఇప్పటికే కోస్తా జిల్లాలలో పవన్ మ్యానియా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులలో అంచనాలకు అనుగుణయంగా ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే పవన్ మ్యానియా మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది..