రాజమౌళి మూవీ కోసం అన్ని నెలలు ట్రైనింగ్ తీసుకోనున్న మహేష్..?

Pulgam Srinivas
దర్శకదీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. అలా ఇప్పటి వరకు తన కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ మరియు గుర్తింపు వచ్చాయి. ఆఖరుగా ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు.


ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. అలాగే ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడంతో రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇది అలా అంటే రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి ముందు మహేష్ డిసెంబర్ నెల నుండి మూడు నెలల పాటు ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు నెలల స్పెషల్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత మహేష్ ... రాజమౌళి సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: