మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం
గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ
మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ
మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత చరణ్ ... ఉప్పెన
మూవీ తో అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిపోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ
మూవీ చరణ్ కెరియర్ లో 16 వ
మూవీ గా రూపొంద నుండగా ... బుచ్చిబాబు కెరియర్ లో ఈ
మూవీ రెండవ సినిమాగా రూపొంద బోతుంది. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలు వడింది.
ప్రస్తుతం బుచ్చిబాబు ... చరణ్ కెరియర్ లో 16 వ
మూవీ గా రూపొందబోయే సినిమాకు సంబంధిం చిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోం ది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
మూవీ కి
సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ను ఈ
మూవీ బృందం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలుబడబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో
విజయ్ సేతుపతి ని తీసుకుని ఆలోచనలో ఈ
మూవీ బృందం ఉన్నట్లు ... అందులో భాగంగా ప్రస్తుతం ఈ
మూవీ మేకర్స్ ఈ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన
మూవీ లో
విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ
మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ లోని
విజయ్ సేతుపతి నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.