ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. అలా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి ఈ సంవత్సరం భారీ కలక్షన్ వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఆది పురుష్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి 385 కోట్ల భారీ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రవితేజ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

వీర సింహా రెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 127 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: