ఆన్ స్క్రీన్ పై మళ్ళా రొమాన్స్ చేయబోతున్న నాగార్జున - టబు...!!
ఆ తరువాత బాలీవుడ్కు వైపు కు వెళ్లి పలు చిత్రాల లో నటించి అక్కడ మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టబు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా తో తెలుగు లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇప్పుడు మరొకసారి నాగార్జున తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి ఒక సినిమా ని నాగార్జున తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఇందు లో నాగార్జున కు జోడి గా టబు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరొకసారి ఈ రొమాంటిక్ పేరు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి అజయ్ భూపతి ప్రస్తుతం పాయల్ రాజుతో కలిసి మంగళవారం అని ఒక హర్రర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నాగార్జునతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు కథ చెప్పగా నచ్చడంతో త్వరలోనే టబుకు కూడా కథ వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా పైన అఫీషియల్ గా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.