అఫీషియల్ : "జవాన్" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తన కెరియర్ లో నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే ఈ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. షారుక్ ఆఖరుగా పఠాన్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది.


ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా పఠాన్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ ప్రస్తుతం జవాన్ అనే మరో భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియమణి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.


తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7 వ తేదీన హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై హిందీ ... తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకోగా ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: