ఆ కులం యొక్క గొప్పతనం గూర్చి చెప్పిన నాగబాబు....!!
పవన్ కళ్యాణ్ తల్లి రెల్లి కులస్తురాలు ఆ మాట చెప్పుకోవడానికి పవన్ లోలోపల మథనపడుతుంటాడని అన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. గత ఎన్నికల్లో ఫస్ట్ టైం మా తమ్ముడు నేను రెల్లి కులాన్ని తీసుకుంటాను అని అన్నాడు. ఎందుకంటే మన సమాజం రెల్లి కులస్తుల్ని చాలా తక్కువ చేసి చూసింది తెలిపారు నాగబాబు. మీకో ఓ మాట చెప్తున్నా కాపు కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. బహుశా ఏ వ్యక్తి అయినా ఏ కులంలో పుట్టినా ఆ కులంలో పుట్టినందుకు గర్వపడతాడు. గర్వపడాలి కూడా నిజంగా మా అమ్మ గారు రెల్లి కులంలో పుట్టి ఉంటే మేం గర్వంగానే ఫీల్ అయ్యేవాళ్లం.
మా అమ్మ రెల్లి కులస్తురాలని చెప్పుకోవడానికి గర్వపడే వాళ్లం అని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. మామూలుగా ఒక తల్లి తన బిడ్డ విసర్జాన్ని కడిగి క్లీన్ చేస్తుంది. కానీ తమ బిడ్డల కాకపోయినా ఈ సమాజం కోసం దాన్ని ఒక వృత్తిగా ఎన్నుకుని సఫాయి కార్మికులు వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. మనల్ని ప్రేమగా చూసుకునే తల్లి ఎంత గొప్పదో రెల్లి కులస్తులు కూడా అంతే గొప్పవాళ్లు. వాళ్ల విలువ మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఎవరూ చేయలేని పనిని వాళ్లు చేస్తున్నారు. వాళ్లకి దండం పెట్టాలి. నిజంగా మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే గర్వంగా చెప్పుకునే వాళ్లం అని చెప్పుకొచ్చారు నాగబాబు.