సెప్టెంబర్ నెలలో తెలుగు నుండి ఏకంగా అన్ని పాన్ ఇండియా మూవీలు..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందినటువంటి బాహుబలి సిరీస్ మూవీ లు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఈ మధ్య చాలా పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటే ... మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను డిసపాయింట్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొన్ని పాన్ ఇండియా మూవీ లు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదటగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "స్కంద" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

ఇలా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మూడు పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: