ఆ అవార్డ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన పోసాని...!!

murali krishna
ఏపీ స్టేట్ ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ పోసాని కృష్ణ మురళి తాజాగా నంది అవార్డ్స్ గురించి స్పందించారు.గతం లో నంది అవార్డుల గురించి ఈయన మాట్లాడుతూ తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.నంది అవార్డులు అంటే కమ్మ అవార్డులు అంటూ ఈయన ఆరోపణలు చేశారు. ఒక్కో కాంపౌండ్ కు రెండు మూడు నదులు వెళ్లాయని పోసాని తీవ్రస్థాయి లో నంది అవార్డుల గురించి ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించబోతున్నారని దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ క్రమం లోనే ఈ నంది అవార్డుల గురించి నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజాయితీ గా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ నంది అవార్డులు డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి ఇవ్వడం కుదరదు కనుక ముందుగా నాటక రంగానికి నంది అవార్డులను ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు. ఇక మేము నంది అవార్డులను ఉత్తములకు అర్హులకు మాత్రమే ఇస్తాము రాష్ట్రంలో ఎవరైనా ఉచితంగా షూటింగులు చేసుకోవచ్చు. స్టూడియోలు కట్టినా సహకరిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెలరోజుల పాటు సమయం ఉంటుందని తెలిపారు. ఉపసంహరణకు నెల రోజులు గడువు ఉంటుందని ఐదు క్యాటగిరిలలో పోటీ ఉండగా 73 అవార్డులు ఉంటాయని ఈ సందర్భంగా విజయ్ కుమార్ నంది అవార్డుల నోటిఫికేషన్ గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: