మహేష్ అభిమానుల అసహనానికి గురైన త్రివిక్రమ్ !

Seetha Sailaja
అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ త్వరలో రాబోతోంది అంటూ వచ్చిన ఒక ప్రకటన మహేష్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ షూటింగ్ కనీసం 50 శాతం కూడ పూర్తికాలేదు అన్న లీకులు వస్తున్నాయి.


ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకుండా త్రివిక్రమ్ ఎందుకు బన్నీతో సినిమా అంటూ ప్రకటన వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తించాడు అంటూ మహేష్ అభిమానుల ఆవేదన. ఇప్పటికే మహేష్ తో తీస్తున్న సినిమా రకరకాల కారణాలతో షూటింగ్ ముందుకు కదలడంలేడు. ఈ మూవీ నుండి పూజా హెగ్డే ను తప్పించి శ్రీలీలకు ప్రమోషన్ ఇచ్చారు.


మరి ఈ సినిమాకు సంబంధించి సెకండ్ హీరోయిన్ ఎవరు అన్న విషయం క్లారిటీ లేదు. ఈ మూవీకి సంగీత దర్శకుడుగా తమన్ కొనసాగుతాడ లేదా అన్న విషయం పై కూడ రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా గత కొంతకాలంగా త్రివిక్రమ్ కొన్ని భారీ సినిమాలకు స్క్రిప్ట్ అందిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘బ్రో’ ‘ఓజీ’ సినిమాల స్క్రిప్ట్ అదేవిధంగా సలహాలు త్రివిక్రమ్ నుండి వస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తునాయి.


దీనితో త్రివిక్రమ్ మహేష్ సినిమా పై పూర్తిగా శ్రద్ధ పెట్టలేడు అన్న సందేహాలు కూడ మహేష్ అభిమానులను వెంటాడుతున్నాయి. రాజమౌళి తో మహేష్ మూవీ రావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మహేష్ నుండి వచ్చే ఏకైక సినిమా ‘గుంటూరు కారం’ ఒక్కటే. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈసినిమా పై పూర్తి దృష్టి పెట్టకుండా త్రివిక్రమ్ ఎందుకు ఇప్పుడు బన్నీ సినిమాను రంగంలోకి తీసుకువచ్చాడు అంటూ సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మహేష్ అంగీకారాం తీసుకుని బన్నీ సినిమాను లైన్ లో పెట్టి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: