వైరల్ గా మారిన పూనమ్ కౌర్ 'గురువు 'స్టోరీ....!!

murali krishna
సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా కూడా ఇట్టాగే వైరల్ అవుతూ ఉంటాయి. తమ పర్సనల్ విషయాలే కాకుండా అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు.ఇక తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ పంచుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది. ఇంతకూ అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తన అందంతో యువత హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ తన నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయంతో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

ఈమె మాయాజాలం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇక సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఒక్కోసారి ఆమె చేసే పోస్ట్ లు మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి. అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి. ఇక రాజకీయ పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది. ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది. ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మాత్రం క్షణాలో అది వైరల్ అవుతుంది. అలా ఇప్పటికీ ఆమె చేసిన పోస్ట్ వల్ల చాలా వివాదాలు తలెత్తాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా పోస్ట్లు చేస్తుంది. ఇక అప్పుడప్పుడు ఈమె చేసే కొన్ని పోస్ట్ లు, పోస్ట్లు లు పాజిటివ్ గా కూడా ఉంటాయి. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని బాగా లోతుగా చర్చ చేసే లాగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయాలలో తిరుగుతూ బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి సినిమాలకు దూరంగా ఉంటూ అటు సోషల్ మీడియాలతో, ఇటు రాజకీయాలతో బాగా రచ్చ లేపుతూ ఉంటుంది. ఇక ఈమెకు దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి. బాగా దేవుళ్లను దర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా తను ఒక స్టోరీ పంచుకుంది. ఇక ఆ స్టోరీలో ఏముందంటే.. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. గురువును టామ్, డిక్ అని పిలవద్దని.. నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురు కాదు.. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అని పంచుకుంది. దీంతో ఆమె స్టోరీ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అది చూసి కొందరు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: