సమస్యలలో పడ్డ రావణాసురుడి కూతురు !
తన పై జరుగుతున్న ట్రోలింగ్ కు ఏమాత్రం బెదరని సారా అలీ ఖాన్ ఈవిషయం పై విభిన్నంగా స్పందించింది. తాను ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోనని కేవలం తన పాజిటివ్ ఆలోచనలు మాత్రమే పట్టించుకుంటాను అంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి ఘాటైన సమాధానం ఇచ్చింది.
అంతేకాదు ఈ నెగిటివ్ ట్రోలింగ్ తనకు దేవుడు పై ఉన్న నమ్మకాన్ని భక్తిని తగ్గించలేవు అంటూ కామెంట్స్ చేసింది. తన సినిమాలు చూసే అభిమానులు ఏమి మాట్లాడినా తాను పట్టించుకుంటాను కానీ అనవసరంగా తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెట్టె వారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం తనకు లేడు అని అంటోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ‘ఆదిపురుష్’ మూవీ ఘోర పరాజయానికి ఆమూవీలో రావణాసురుడు గా నటించిన సైఫ్ ఆలీఖాన్ కారణం అంటూ ప్రభాస్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
ఇప్పుడు ఈ బాదితుల జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడ వచ్చి చేరడం షాకింగ్ న్యూస్ గా మారింది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘దేవర’ మూవీలో సైఫ్ ఆలీఖాన్ మెయిన్ విలన్ గా ఎంపిక అయినట్లు వస్తున్న వార్తలు విని తారక్ అభిమానులు హడాలిపోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ పరాజయానికి కారకుడైన సైఫ్ ను ఇప్పుడు ఎధైర్యంతో జూనియర్ మూవీకి కొరటాల ఎంపిక చేశాడు అంటూ తారక్ అభిమానులు ఖంగారు పడుతున్నారు..