పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.. అందులో ఆదిపురుష్ సినిమా ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా అది ప్లాప్ టాక్ తెచ్చుకొని చాలా నష్టాలు మిగిల్చింది.ఇతిహాస రామాయణం సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా ప్లాప్ అయ్యింది.. రామాయణంను మార్చి తీయకపోయి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు రాబట్టి ఉండేది..కానీ ఆ అవకాశాన్ని ఆదిపురుష్ టీం మిస్ చేసుకుంది.. రామాయణం ను పూర్తిగా మార్చేసి మరో కోణంలో తీయడంతో డైరెక్టర్ ఓం రౌత్ మీద ఇంకా రైటర్ మీద ఆగ్రహంగా ఉన్నారు హిందువులు. ఇక ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశ పరచడంతో తర్వాత ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు.ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ రాబోతున్న మూవీలు సలార్, ప్రాజెక్ట్ కే రాజా డీలక్స్.
ఈ సినిమాల అప్డేట్ ల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ నెలలోనే డబల్ ట్రీట్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. సలార్ టీజర్ రిలీజ్ అవ్వబోతుంది ఇంకా దాంతో పాటు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే టైటిల్ కూడా ఇదే నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఈ టైటిల్ రిలీజ్ ను యూఎస్ లో చేయనున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇలా జులై నెలలోనే రెండు అప్డేట్ లతో డబల్ ట్రీట్ ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. మరి ఇదే నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక సలార్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.. ప్రాజెక్ట్ కే సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. సలార్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కు సిద్ధం అవుతుంటే.. ప్రాజెక్ట్ కే సినిమా 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.