ఆదిపురుష్ కి షాకుల మీద షాకులు?

Purushottham Vinay
పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి మూడు రోజులు నెగటివ్ టాక్ తోనే చాలా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.నెగటివ్ టాక్ వచ్చిన్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల కలెక్షన్స్ 300 కోట్లు దాటిపోయాయి. అయితే నాలుగో రోజు నుంచి కంప్లీట్ గా డ్రాప్ కనిపించింది.ఇక ఈ డ్రాప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. మొదటి వారం తర్వాత నుంచి టికెట్ ధరలు తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ ఆశించింది. అయితే టికెట్ ధరల తగ్గుదల కూడా ఆదిపురుష్ ని ఏ మాత్రం బెన్ ఫిట్ కాలేదు. కలెక్షన్స్ మరింత తగ్గాయి. దీంతో సినిమా ఓవరాల్ గా వసూళ్లు 450 కోట్లకి కూడా మించలేదని సమాచారం తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అందుకుంటుందని డిస్టిబ్యూటర్స్ పెట్టుకున్న ఆశలు గల్లంతు అయిపోయాయి.



ఎందుకంటే ఆదిపురుష్ క్వాలిటీ ప్రింట్ ప్రైవసీ రూపంలో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఇక ఈ సినిమాకి పూర్తిగా బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.16వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఆదిపురుష్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ 25 నుంచి 28 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 45 లక్షల దాకా షేర్ ని ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా 285 కోట్ల దాకా షేర్ ని ఈ చిత్రం అందుకోగలిగింది. అయితే ఈ సినిమా టోటల్ బిజినెస్ 320 కోట్ల దాకా జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. దానిని ఇక అందుకోవడం సాధ్యం కాదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.మొత్తానికి ఆదిపురుష్ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలు వ్యతిరేకత ఈ సినిమా కలెక్షన్స్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపించింది అనేది ఈ రిజల్ట్ తోనే స్పష్టంగా తెలిసిపోయింది. తెలుగులో కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ సినిమాతో భారీ నష్టాలపాలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: