అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కోసం అంతకాలంగా పనిచేస్తున్న త్రివిక్రమ్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో అల్లు అర్జున్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో అనే మూడు మూవీ లు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. ఇలా ఇప్పటికే విరి కాంబినేషన్ లో రూపొందిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అద్భుతంగా అలరించడంతో ఈ కాంబినేషన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సపరేట్ క్రేజ్ ఉంది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే వీరి కాంబినేషన్ లో రూపొందబోయే నాలుగవ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.


ఇకపోతే అల్లు అర్జున్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే నాలుగో మూవీ చాలా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ ఒక సంవత్సరం క్రితమే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లకు సంబంధించిన పనులు పూర్తి కాగానే వీరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: