జూనియర్ పవన్ కళ్యాణ్, జూ. భూమిక.. ఖుషి సీన్ రిపీట్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో హిట్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఇక అలాంటి సినిమాలలో ప్రేక్షకులకు ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచే సినిమాలలో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఖుషి సినిమాలోని నడుము సీన్ అయితే నేటి జనరేషన్ లో కూడా ట్రెండింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలోని నడుము సీన్ ఏ హీరో రిపీట్ చేసిన కూడా థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తిపోతూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా నడుము సీన్ లో పవన్ కళ్యాణ్, భూమిక చెప్పే డైలాగ్ లు కూడా ఇప్పటికీ కూడా ఎంతో ఫేమస్. అయితే అలాంటి నడుము సీన్ ను ఎంతోమంది హీరోలు తమ సినిమాలలో పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకులను ఆ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి కూడా. కానీ ఇప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ భూమికలకు సంబంధించిన నడుము seen కు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. జీ తెలుగు ఛానల్లో డ్రామ జూనియర్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది అని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిన్నారులు తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

 ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని నడుము సీన్ రీ క్రియేట్ చేశారు చిన్నారులు. అయితే ఇక పవన్ కళ్యాణ్ భూమిక నడుము చూసినట్లుగా కాకుండా.. పక్కనే ఎగ్జామ్ రాస్తున్న సమయంలో జూనియర్ పవన్ కళ్యాణ్ జూనియర్ భూమిక పేపర్ చూసి రాస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. ఇక ఖుషి సినిమాలో పవన్ చెప్పిన డైలాగులను ఆ చిన్నారి ఎంతో చక్కగా పవన్ మేనరిజంతో చెప్పడం అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఇక ఇద్దరు చిన్నారులు చేసిన నడుము సీను రీ క్రియేషన్ కాస్త  ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: