భారతీయుడు 3 కూడా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?

Purushottham Vinay
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన సినిమా 'భారతీయుడు'. ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత  దర్శకుడు శంకర్ సీక్వెల్ తీస్తున్నారు.ఈ మూవీని తమిళ్ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఇండియన్ 2 కోసం షూట్ చేసిన కొన్ని సీన్లు ఇప్పుడు ఉపయోగించడం లేదు. వాటితో ఇండియన్ 3 సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు" అన్నారు. మరోవైపు ఈ సినిమాలోని మేజర్ సీన్స్ చూసిన కమలహాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.ఇంకా అంతేకాదు, శంకర్ కు ఖరీదైన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఈ వాచ్ ధర సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. దీనిపై శంకర్ ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ఈ సినిమా అవుట్‌ పుట్ విషయంలో శంకర్‌ తో పాటూ కమల్ హాసన్ కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.



ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ గురించి కొన్నాళ్లుగా సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు ఓ క్లారిటీ తెలుస్తోంది. ఇండియన్2 సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చని సమాచారం.ఈ మూవీ వచ్చే సమ్మర్ రేస్‌లో నిలవనుందని ఇన్‌ సైడ్ టాక్ నడుస్తోంది. ఇక 'భారతీయుడు 2' చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని, ముఖ్యంగా పొలిటికల్ పంచ్ డైలాగ్స్ బాగా పెలతాయి అని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా షూట్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యిందట.'ఇండియన్ 2' (భారతీయుడు 2) నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, విజువల్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు ఉదయనిది స్థాలిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: