మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా చిరంజీవి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ దర్శకుడు చిరంజీవి కి ఒక అదిరిపోయే కథను వినిపించినట్లు ... ఆ కథ మొత్తం విన్న చిరంజీవి వెంటనే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కళ్యాణ్ కృష్ణ చిరంజీవి మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ లో చిరంజీవి సరసన త్రిష ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ... అందులో భాగంగా త్రిష తో ఈ మూవీ మేకర్స్ సంప్రదింపులను కూడా జరుపుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అన్ని కుదిరితే ఈ మూవీ లో త్రిష ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి ... త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ మూవీ రూపొందింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ... కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఆగస్టు నెలలో ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ... సుశాంత్ ఈ మూవీ లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.