చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న బ్యూటిఫుల్ యాంకర్ కం నటి..!

Pulgam Srinivas
యాంకర్ గా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్యామల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్యామల ... సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో సుకుమార్ స్క్రీన్ ప్లే లో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.
 


ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అలాగే ఈ సినిమాలో ఈ నటి కూడా చాలా కీలకమైన పాత్రను పోషించడంతో ఈ మూవీ ద్వారా శ్యామల కు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ లో తన నటనకు గాను ఈ నటికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఇకపోతే ప్రస్తుతం వరుస టీవీ షో లతో ... సినిమా  ఫంక్షన్ లతో ... సినిమా లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈనటి సోషల్ మీడియాలో కూడా వరుసగా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి చేతికి ఒక వాచ్ పెట్టుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా పోస్ట్ చేయగా ప్రస్తుతం అది అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: