అభిమాని చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా?
ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిన నేపథ్యం లో.. కేవలం సీనియర్ హీరోల సినిమాల్లో మాత్రమే ఛాన్సులు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. అదే సమయం లో అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీబిజీగానే గడుపుతుంది. ఇకపోతే ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే ఒక అభిమానిని కలిసిన తమన్న అభిమాని చేసిన పనికి చివరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టులో తమన్నాను ఒక మహిళ అభిమాని కలవడానికి వచ్చింది.
తన అభిమాన హీరోయిన్ తమన్నాను చూడగానే ఆ ఫ్యాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. అయితే తన అభిమాన హీరోయిన్ కాళ్లకు నమస్కారం చేయడమే కాదు.. తమన్న ముఖాన్ని టాటూగా వేయించుకున్నట్లు ఆమె తెలిపింది. దీంతో టాటూ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మిల్కీ బ్యూటీ. దీంతో వెంటనే అభిమానిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమెతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తమన్నా. ఇక ఈ విషయం తెలిసి అభిమానానికి హద్దులు ఉండవంటే ఇదేనేమో అంటూ ఎంతోమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.