తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
దళపతి విజయ్ ఆఖరుగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వారిసు అనే
తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.
రష్మిక మందన
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ కి
తమన్ సంగీతం అందించాడు. ఈ
మూవీ తెలుగులో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
త్రిష ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...
లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం
అక్టోబర్ 20 వ తేదీన తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి "నా రెడీ" అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ పాట విడుదల అయిన 5 రోజుల్లోనే 33 మిలియన్ వ్యూస్ ను ... 1.9 మిలియన్ లైక్స్ ను సాధించి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
దానితో ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అదిరిపోయే రేంజ్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు
విజయ్ ...
లోకేష్ కాంబినేషన్ లో
మాస్టర్ మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. ఈ
సినిమా తెలుగు
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించింది.