పవన్ కళ్యాణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో తొలిప్రేమ సినిమా ఒకటి. ఈ మూవీ ద్వారా పవన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్క సారిగా పెరిగి పోయింది. ఈ అద్భుతమైన విజయవంతమైన సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించగా ... కీర్తి రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వాసుకి , అలీ వేణు మాధవ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... జి వి జి రాజు ఈ మూవీ ని నిర్మించాడు. దేవా ఈ మూవీ కి సంగీతం అందించాడు.
ఈ మూవీ విజయంలో దేవా అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. 1998 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను సాధించిన ఈ సినిమాను తిరిగి ఈ సంవత్సరం జూన్ 30 వ తేదీన థియేటర్ లలో 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లను కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ టికెట్ బుకింగ్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా తొలిప్రేమ సినిమా నిర్మాత అయినటువంటి రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
తాజాగా తొలిప్రేమ నిర్మాత జి వి జి రాజు మాట్లాడుతూ ... తొలిప్రేమ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ఆర్టిస్ట్ కాబట్టి నేను అతనికి రెమ్యూనిరేషన్ ముందే ఇవ్వలేదు. నాకు నెల నెల ఖర్చులకు డబ్బులు ఇవ్వండి చాలు అని పవన్ అనేవాడు. ఆ డబ్బులతో ఆయన బుక్స్ ... మొబైల్ ఫోన్స్ కొనుక్కునేవాడు. సినిమా రిలీజ్ అయిన రెండవ రోజు వెళ్లి ఒక పళ్లెంలో రెమ్యూనరేషన్ పెట్టి ఇచ్చాను అని జి వి జి రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.