ఇచ్చిన మాట తప్పుతున్న కాజల్ అగర్వాల్....!!

murali krishna
మామూలుగా కొంతమంది పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి తర్వాత జరిగే పరిణామాలు ముందే ఊహించుకొని ముందు జాగ్రత్తతో కొన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు.ఈ జనరేషన్ పెళ్లికి ముందే జంటల మధ్య ఇటువంటివి బాగా నడుస్తున్నాయి. ఇక ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటులు పెళ్లికి ముందు పెట్టుకున్న కండిషన్స్ బయటికి వచ్చాయి. అయితే తాజాగా కాజల్ విషయంలో కూడా తన భర్త ఒక కండిషన్ పెట్టినట్లు తెలిసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో అందర్నీ తన వైపుకు మలుపుకుంది కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమాతో తొలిసారిగా కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్గా నటించినది. ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది. తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ స్టార్ హోదాకు చేరుకుంది.
మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను ప్రేమ పెళ్లి చేసుకోగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. బిడ్డ పుట్టాక కూడా తన అందంలో మార్పులు రాలేవని చెప్పాలి. జిమ్ములో గంటల తరబడి కష్టపడి మళ్ళీ మునుపటి రూపాన్ని సొంతం చేసుకుంది.కేవలం సినిమాలలోనే కాకుండా పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ బాగా స్టోరీస్, పోస్టులు పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కాజల్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే పెళ్లికి ముందు తన భర్త గౌతమ్ తనకు ఒక కండిషన్ పెట్టాడట. నువ్వు సినిమా షూట్ లలో ఎంత బిజీగా ఉన్నా.. ఎంత టఫ్ సిచువేషన్ లో ఉన్న ప్రతిరోజు నాతో ఒక గంట సమయాన్ని కేటాయించాలి అని అన్నాడట.
అది మాత్రమే నీ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడట. దీంతో కాజల్ వెంటనే ఆ కండిషన్ కు ఒప్పుకుందట. అలా పెళ్లయిన కొత్తలో వరుస సినిమాలు ఉన్నా కూడా భర్త కోసం కాస్త బ్రేక్ తీసుకొని అతడితో మంచి సమయాన్ని గడిపింది. కానీ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ తో వరుస సినిమాలు చేస్తుండు పోవటంతో కాజల్ బాగా బిజీ అయింది. ఇక సినిమాల పరంగా కాస్త బ్రేక్ దొరుకుతే చాలు బాబుతో గడుపుతుంది. గౌతమ్ కు వ్యాపారాలు చూసుకుంటూ బాగా బిజీ అయ్యాడు.దీంతో కాజల్ తన భర్తతో గంట సమయం కూడా కేటాయించడం లేదని.. ఏదైనా ఫ్యామిలీ పార్టీలో ఉన్నప్పుడే మాత్రమే కాస్త సమయాన్ని కేటాయిస్తుంది అని.. అంతకుమించి వీరిద్దరికి ప్రైవసీ దొరకట్లేదు అని కొందరు అనుకుంటున్నారు. అయితే గౌతమ్ కూడా పెళ్లి, పిల్లల తర్వాత ఇలాంటివి జరుగుతుందని ముందే ఊహించుకొని అటువంటి కండిషన్ పెట్టాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. పాపం గురుడు బాగా ఆలోచించి కండిషన్ పెట్టినప్పటికీ కూడా కాజల్ కు మాత్రం సమయం దొరకట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: