"సామజవరగమన" ప్రీమియర్స్ కు అదిరిపోయే పాజిటివ్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆ తర్వాత మెంటల్ మదిలో ... బ్రోచేవారెవరురా ... రాజ రాజ చోరా వంటి విజయవంతమైన సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడుగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రాజ రాజ చోరా సినిమా తర్వాత ఈ నటుడు వరుసగా అనేక సినిమాలలో నటించాడు. కాకపోతే ఏ సినిమాలు కూడా ఈ హీరో కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించలేదు.


ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు సామజవరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ ని నిన్న అనగా జూన్ 26 వ తేదీన సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు కొన్ని ప్రాంతాలలో ఫ్యామిలీ ఫస్ట్ ప్రీమియర్స్ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల నుండి ఈ మూవీ కి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.


సినిమా అద్భుతంగా ఉన్నట్లు ... ఈ మూవీ లో ముఖ్యంగా కామెడీ అదిరిపోయినట్లు ... మొదటి నుండి చివరి వరకు అద్భుతమైన కామెడీతో అదే విధంగా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ ముందుకు సాగినట్లు ఈ మూవీ అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నట్లు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ దక్కుతున్నాయి. మరి ఈ సినిమాతో దాదాపుగా శ్రీ విష్ణు అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: