
సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న హంస నందిని.. నిజమెంత?
ఇక హంస నందిని పెట్టే ఒక్కో పోస్ట్ కి విపరీతమైన ఫాలోయింగ్ తో పాటు వ్యూస్ , లైక్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుర్ర కారు మనసు దోచుకునే పనిలో పడ్డ ఈ ముద్దుగుమ్మ నెట్టింట రకరకాల హాట్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే క్యాన్సర్ సోకిన తర్వాత గుర్తుపట్టకుండా మారిపోయిన ఈమె కొత్త లుక్ లో అందరిని అలరిస్తోందని చెప్పవచ్చు. ఒక్కటవుదాం అనే సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈమె టాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంది.
ఇక తర్వాత అత్తారింటికి దారేది, అధినేత, లౌక్యం, లెజెండ్, సోగ్గాడే చిన్నినాయన, రుద్రమదేవి వంటి చిత్రాలలో నటించి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈమె ఇటీవలే కీమోథెరపీలు చేయించుకొని కోలుకుంది. తాజాగా ఆధ్యాత్మిక సేవలోకి మారిపోయిన ఈమె సద్గురు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం.. ప్రతిదీ కూడా ఇక్కడే ఉంది మీరు దానిని గ్రహించలేరు.. కానీ నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తి ని నేను గ్రహించగలిగాను అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ.. దీన్ని బట్టి చూస్తుంటే ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.