మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే చరణ్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1275 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.
రంగస్థలం : రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లోని చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ 215 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మగధీర : చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా ... రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ 130 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.