బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఇప్పటికే ఎన్నో భారీ బ్లాక్ బాస్టర్ హిందీ సినిమా లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం వరుసగా అపజయాలను ఎదుర్కొన్న షారుక్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ కొంత కాలం క్రితమే పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో దీపికా పదుకొనే షారుక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానానికి గాను ఈ మూవీ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
ఈ మూవీ విజయంతో షారుక్ తిరిగి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ లో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని త్వరలో స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ ఛానల్ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.