ఆ ఇద్దరు హీరోయిన్స్.. నాకు చాలా క్లోజ్ : కాజల్
ఇక దశాబ్ద కాలానికి పైగానే అటు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ హవా నడిపిస్తుంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు కూడా ప్రతి ఒక్కరి సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లును పెళ్లి చేసుకుని ఇక ఇంటి కోడలుగా మారిపోయింది. అయితే ఇక వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇటీవలే ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. ఇక తన కొడుకు నైల్ కిచ్లు అని నామకరణం చేశారు.
ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. తనను భర్త గౌతం తనను చిన్నపిల్లల చూసుకుంటాడని.. పెళ్లి వల్ల అమ్మానాన్నలకు దూరం అయ్యారు అనే ఫీలింగ్ రానివ్వడు అంటూ కాజల్ చెపుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో సమంత, తమన్నాతో క్లోజ్ గా ఉంటానని.. ఇక ఎన్నో విషయాలను వారితోనే షేర్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక కొడుకు నైల్ కిచ్లు ఇచ్చిన మాతృత్వపు అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టం అంటూ తెలిపింది. కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది.