పవన్ కళ్యాణ్ తనయుడు.. వర్కౌట్ లు మొదలెట్టేసాడుగా?
ఇకపోతే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా మారిన.. లేదంటే అదృష్టం కలిసి వచ్చి సీఎం గా మారినా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. దీంతో ఇక పవన్ కళ్యాణ్ స్థానాన్ని అఖీరానందన్ తో భర్తీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అకీరా సినిమా ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.
కాగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల తనయుడు అఖీరా నందన్ ఇక ఇతివలె వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో తెలుగు పాటలు వింటూ కనిపిస్తున్నాడు అకిరా నందన్. తెలుగు పాటలు ప్లే చేయాలని అడిగినప్పుడల్లా నన్ను పిచ్చిదానిలా చూసేవారు. కానీ వాటిని నేను పట్టించుకోను. వర్కౌట్లు చేసేటప్పుడు అర్థం పర్థం లేని ఇంగ్లీష్ సాంగ్స్ కు బదులు మాతృభాషలోని పాటలను వినమంటూ అఖిరాను ప్రోత్సహించేదాన్ని.. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవించి ఇదే విధంగా చేస్తారని అనుకుంటున్నా అంటూ రేణు దేశాయ్ కామెంట్ చేసింది.