తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే సినిమాలో హీరోగా నటించాడు. రామ్ అబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు ముందుగానే ఈ సినిమా బృందం ఫ్యామిలీ ఫస్ట్ ప్రీమియర్స్ పేరుతో జూన్ 26 వ తేదీన సోమవారం రోజు ఈ సినిమాను కొన్ని థియేటర్ లలో ప్రీమియర్స్ వేయనుంది. అందుకు సంబంధించిన థియేటర్ లిస్ట్ ను కూడా తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది.
ఈ లిస్ట్ ప్రకారం ఈ సినిమాను జూన్ 26 వ తేదీన సోమవారం నాడు విజయవాడbలోని క్యాపిటల్ సినిమాస్ థియేటర్ లో ... గుంటూరు భాస్కర్ సినిమాస్ స్క్రీన్ 2 థియేటర్ లో ... వైజాగ్ సీఎంఆర్ ఐనాక్స్ థియేటర్ లో ... నెల్లూరు స్పైస్ సినిమాస్ స్క్రీన్ 1 లో , కాకినాడ ఆనంద్ కాంప్లెక్స్ స్క్రీన్ 3 లో , ఏలూరు సాయి బాలాజీ కాంప్లెక్స్ థియేటర్ లో , కర్నూల్ ఆనంద్ కాంప్లెక్స్ థియేటర్ లో , కడప అప్సర సినిమాస్ థియేటర్ లో , తిరుపతి జయ శ్యామ్ థియేటర్ లో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ ప్రీమియర్స్ ను వేయనున్నారు. మరి ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.