జబర్దస్త్ నరేష్.. అసలు వయస్సు ఎంతో తెలిస్తే షాకే?
వరంగల్ జిల్లా జనగాం దగ్గరలోని అనంతపురం అనే ఊర్లో పుట్టాడు నరేష్. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో అతను బాధపడుతూ ఉన్నాడని చెప్పాలి. ఇక జబర్దస్త్ వచ్చిన తర్వాత అతను అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. అయితే జబర్దస్త్ నరేష్ వయస్సు ఎంత ఉంటుంది అనే విషయంపై ఇప్పటికి అటు బుల్లితెర పరీక్షకులకు ఎవ్వరికీ క్లారిటీ లేదు అని చెప్పాలి. కానీ అసలు వయసు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఏకంగా నరేష్ వయస్సు 24 ఏళ్ళు ఉంటుందట. 1999 సంవత్సరంలో పుట్టిన నరేష్ ఢీ షో జూనియర్స్ కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట తిరుగుతుంటే సుధాకర్ ఇక చంటి టీమ్ లో జాయిన్ చేశాడు.
అయితే నరేష్ వయసు గురించి ఎన్నో రోజులుగా చర్చ జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అతను వయస్సు గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. అయితే ఒకానొక సమయంలో ఓ లేడీ కంటస్టెంట్ నరేష్ ని ఎత్తుకుంటే వాడి వయస్సు ఎంతో తెలుసా చిన్నపిల్లోడు కాదు.. 24 ఏళ్ళు అంటూ రోజా నరేష్ అసలు వయసు చెప్పేసింది. దీంతో నరేష్ కూడా నవ్వుకుంటూ అలా ఉండిపోయాడు. కానీ ఆ రోజు షోలో పక్కనే జడ్జిగా ఉన్న ఆమని. M మాత్రం షాక్ అయింది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు ఈటీవీలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమంలో కూడా నరేష్ తన కామెడీతో అదరగొడుతున్నాడు.