ఈ మధ్య కాలంలో వరుస
మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న
యువ హీరోలలో
సంతోష్ శోభన్ ఒకరు. ఈ నటుడు పేపర్ బాయ్
మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ
మూవీ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ
యువ నటుడు ఆ తర్వాత ఏక్
మినీ కథ అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ మూవీ.లో కావ్య తప్పర్
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఏక్
మినీ కథ
మూవీ తో ఈ నటుడు కి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటుడు చాలా సినిమాల్లో
హీరో గా నటించాడు. కాకపోతే ఆ
మూవీ లు ఏవి ఈ నటుడు కి పెద్దగా విజయాలను తెచ్చిపెట్టలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
సంతోష్ శోభన్ "శ్రీదేవి శోభన్ బాబు" అనే సినిమాలో హీరోగా నటించాడు.
ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ జి. కిషన్
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా ఈ సంవత్సరం
ఫిబ్రవరి 18 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా ప్రేక్షకులను
బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ
సినిమా బుల్లి తెరపై వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కావడానికి రెడీ అయింది.
ఈ
సినిమా యొక్క శాటిలైట్ హక్కులను
స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ
మూవీ ని రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు
స్టార్ మా చానల్లో వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానుంది. మరి ఈ
సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో చూడాలి.