తమన్నా పట్టుబడితే అంతే.. రాత్రుళ్ళు కూడా అలా చేయాల్సిందే : విజయ్ వర్మ
అయితే కొన్నాళ్ల వరకు ఈ జంట ప్రచారంపై ఎక్కడ స్పందించలేదు. కానీ ఇక మీడియా ముందు మాత్రం తెగ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగేవారు. అయితే ఇటీవల తమన్నా డేటింగ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. విజయవర్మతో ప్రేమలో పడిన విషయం నిజమేనని.. ప్రస్తుతం తాము డేటింగ్ లో ఉన్నాము అంటూ తెలిపింది తమన్న. అయితే తమన్నా లవ్ ఫై క్లారిటీ ఇచ్చిన కేవలం 24 గంటల్లోనే అటు విజయవర్మ కూడా ఓపెన్ అయ్యి తమన్నతో రిలేషన్షిప్ నిజమే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ జంట లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అని చెప్పాలి.
ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయవర్మ తమన్నా గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. తమన్నా చాలా ఐకానిక్ అని ఏ విషయంలో అయినా పద్ధతిగా ఆలోచిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె ఏదైనా విషయంపై పట్టుబడితే ఇక అంతే సంగతులు జరిగి తీరాల్సిందే. అయితే రాత్రుళ్లు నిద్ర లేకపోయినా సరే కానీ వర్కౌట్ చేయమంటూ ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. నిద్రపోతున్న సరే లేపి మరీ వర్కౌట్స్ చేయమంటుంది అటు కామెంట్ చేసాడు విజయవర్మ. ఈ కామెంట్స్ పై తమన్న స్పందిస్తూ.. నేను తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈజీగా వర్కౌట్ చేసేస్తాను. కానీ విజయ్ అలా కాదు కడుపునిండా తింటాడు. కానీ వర్కౌట్ చేయడు. అయినా వెయిట్ కూడా రాడు అదేంటో నాకు అసలు అర్థం కాదు అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది.