పాత్ర డిమాండ్ చేయడం వల్లే అలా చేయాల్సి వచ్చింది :: తమన్నా

murali krishna
తెలుగు లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో తమన్నా ఒకరు ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.తెలుగులో అందరూ స్టార్ హీరోలతో నటించి మెప్పించిన తమన్నా తాజాగా జీ కర్ద  అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు ప్రస్తుతం ఈ సీరీస్ హిందీలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది.ఇందులో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గా నటించి గ్లామర్ డోస్ పెంచేసిందని కొందరు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తమన్నా ఈ కామెంట్స్ పై రిప్లయ్ ఇచ్చారు.

మొదట గా మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ మూవీతో తమన్నా హీరోయిన్ గా నటించి తెలుగు తెరపై పరిచయం అయింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ లోనూ నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. అనంతరం తెలుగు స్టార్ హీరో చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తదనంతరం మెల్ల మెల్లగా బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం జీ కర్థ లో కూడా నటించింది.ఇందులో తమన్నా ఎన్నడు లేని విధంగా బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. దీంతో అందరూ తమన్నా కి అవకాశాలు లేకపోవడం కారణంగానే ఇలా బోల్డ్ గా నటిస్తుందంటూ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ వార్తలపై స్పందిస్తూ రిప్లయ్ ఇచ్చారు. ఈ సిరీస్ లో పాత్ర డిమాండ్ చేయడం కారణంగానే నేను బోల్డ్ గా నటించాల్సి వచ్చింది. ఈ సిరీస్ కు బోల్డ్ సీన్స్ చాలా అవసరమని తెలిపింది. ఇద్దరి వ్యక్తుల మధ్య రిలేషన్ ను సహజంగా చూపించే ప్రయత్నంలోనే దర్శకుడు అలా తెరకెక్కించారు. ఈ సీన్స్ నచ్చిన నచ్చకపోయినా కథలో భాగంగానే చూడాలని తమన్నా ప్యాన్స్ కు సూచించింది.ఇక ఈమె గత కొద్దిరోజులుగా తెలుగులో సీనియర్ హీరోల పక్కన నటిస్తూ వస్తున్నారు. అలాగే వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బాలయ్య బాబీ కాంబో లో వచ్చే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: