తొలిప్రేమ: రీరిలీజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందా?

Purushottham Vinay
తొలిప్రేమ: రీరిలీజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో నటించి సూపర్ హిట్ అయిన సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. అప్పట్లో యూత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన సినిమా ఈ తొలిప్రేమ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని ఒక మధ్యతరగతి కుర్రాడి పాత్రలో చూపించారు. పని పాట లేకుండా చిల్లరగా తిరిగే కుర్రాడిగా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ మూవీలో కనిపించాడు.అలాంటి ఆ కుర్రాడు ప్రేమలో పడి.. ఇక ఆ ప్రేమ కోసం ఏం చేశాడు.. ఆ ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా పూర్తి కథ.తొలిప్రేమ సినిమా విడుదల అయ్యి మొత్తం 25 సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా జులై 24 1998లో విడుదల అయ్యింది. కాబట్టి తొలిప్రేమ విడుదల అయ్యి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 30 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు.ఇక తొలిప్రేమ రీ రిలీజ్ ట్రైలర్ ను రేపు ఉదయం 10.30 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో కీలక పాత్ర లో నగేష్.. అలీ.. వాసుకీ.. వేణుమాధవ్ లు నటించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది 90 కిడ్స్ తొలి ప్రేమ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరి చూడాలి రీ రిలీజ్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: