పవన్... అల్లు అర్జున్... రవితేజ... శర్వానంద్ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... అల్లు అర్జున్ ... రవితేజ శర్వానంద్ హీరోలుగా రూపొందుతున్న మూవీ లు షూటింగ్ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరు హీరోలుగా నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఏ దశలో ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా ఈ సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం కొన్ని రెగ్యులర్ సన్నివేశాలను రూపొందిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ... ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో రవితేజ పై రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 35 వ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం శర్వానంద్ ... కృతి శెట్టి లపై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: