"భోళా శంకర్" మూవీ టీజర్ లాంచ్ వేదిక ఖరారు..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా వాల్టేరు వీరయ్య మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... మహతి స్వర సాగర్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.
 


ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్ట బోతుంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టీజర్ ను రేపు ఏ ప్రాంతంలో ... ఏ సమయానికి విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తాజాగా ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ యొక్క టీజర్ ను రేపు అనగా జూన్ 24 వ తేదీన వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో సాయంత్రం గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసారు.


మూవీ టీజర్ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: