మద్యం సేవించడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరో కమలహాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్. కమలహాసన్ వారసురాలు అయినంత మాత్రాన స్టార్డం సంపాదించడం కోసం చాలానే కష్టపడిందని చెప్పవచ్చు. ఎంతో పెద్ద హీరోల కొడుకు ,కూతురైన సరే ప్రేక్షకులకు సరైన నటన అందం లేకపోతే ఆదరించడం కష్టమే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొంతమంది తండ్రికి తగ్గ కొడుకు, కూతురుగా పేరు సంపాదిస్తున్నారు. అలాంటివారిలో శృతిహాసన్ ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. శృతిహాసన్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందు పలు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలలో నటించింది.

హీరోయిన్గా అనగనగా ఒక ధీరుడు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తన తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తన సినీ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళంలో బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించింది. శృతిహాసన్ అప్పుడప్పుడు పలు రకాల పాటలు పాడుతూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. సీనియర్ హీరోలకు జోడిగా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శృతిహాసన్.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హీరో నానితో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన శృతిహాసన్.. ఒక నెటిజన్ శృతిహాసన్ మీరు మద్యం తాగుతారా అని ప్రశ్నించగా.. అందుకు శృతిహాసన్ బదులిస్తూ లేదు నేను మద్యం తాగను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోనని చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నానంటూ సమాధానాన్ని ఇచ్చింది. గతంలో కొన్నిసార్లు శృతిహాసన్ చేతిలో వైన్ గ్లాస్ తో కనిపించినట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. కానీ శృతిహాసన్ మాత్రం తాను వాటన్నిటికీ దూరంగానే ఉన్నానంటూ తెలియజేయడంతో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: