
తన సోయగాలతో టెంప్ట్ చేస్తున్న ఈషా రెబ్బా...!!
తాజాగా ఈషా రెబ్బా ఓ తమిళ చిత్రం ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట. కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.అలాగే దయ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దయ సైతం క్రైమ్ థ్రిల్లర్. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.అయితే ఈషాకు అడపాదడపా అవకాశాలు తప్పితే కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సినిమా పడటం లేదు. ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.
ప్రస్తుతం ఈషా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది.కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు.అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది. మొత్తంగా ఈషా బ్రేక్ కోసం యుద్ధం చేస్తుంది.అదే సమయంలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్దమే అని హింట్ ఇస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈషా రెబ్బా ఫోటో షూట్స్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.