రీ రిలీజ్ కు సిద్ధమైన తొలిప్రేమ సినిమా.. ఎప్పుడంటే..?

Divya
గత కొంతకాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో పాటు మరికొందరి సీనియర్ జూనియర్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ చేసి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ చిత్రాలను ఇలా విడుదల చేయగా కలెక్షన్ల ప్రారంభం కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఒక చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రాలు ఖుషి, జల్సా వంటి చిత్రాలను రీ రిలీజ్ చేయగా బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ ని మార్చేసిన తొలిప్రేమ సినిమాను కూడా ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర బృందం. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాల నేపథ్యంలో జూన్ 30వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కరుణాకరన్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఏకంగా ఈ సినిమా అని 300కు పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఈ సినిమా 4K ప్రింట్ వరకు కూడా దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం.

ఈ సినిమా ట్రైలర్ జూన్ 24వ తేదీన ఉదయం 10:30 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక స్పెషల్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారట.ఆ తర్వాత రీ రిలీజ్ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఈవెంట్ కూడా నిర్వహించడంతో ఈ ఘనత కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి దక్కుతోంది.. పవన్ కళ్యాణ్ హీరోగా తొలిప్రేమ సినిమా 1998లో రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్గా కీర్తి రెడ్డి నటించగా ఈ చిత్రాన్ని దేవా సంగీతాన్ని అందించారు. ఇందులో ఆలీ, వేణుమాధవ్ ,రవిబాబు తదితర నటీనటులు సైతం కీలకపాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: