"లియో" మూవీ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా వారిసు అనే మూవీcతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తమిళ్ లో వారిసు పేరుతో విడుదల కాగా ... తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల కాగా ... తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా అటు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ... ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
 


రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇలా వారసు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిష ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు లోకేష్ కనకరాజు అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం "నా రెడీ" అంటూ సాగే మొదటి పాటను తాజాగా విడుదల చేసింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ విడుదల అయిన 7 గంటల సమయంలోనే 8.8 మిలియన్ వ్యూస్ ను ... 1.3 మిలియన్ లైక్స్ ను సాధించింది. ఇలా ఈ సాంగ్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: